Thursday 27 October 2011

The Businessman Story And Details (Telugu)

The Businessman Story And Details (Telugu)

https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEiBBG8v5MpSH3hV1m2lBKYiW32Eat7d6ycCqJRwBgL6wtxIZQc_5Lq30bFqZhJQ8YHn_KmYLYFtYJ57afLdNu4FDbEP72YZA040D_h8t-MfrxO0030l1dAQgkbOnME_cghoTCyuib2qcdc/s1600/the-business-man-fan-made-wallpaper.jpg

  • మహేష్ బాబు 'బిజినెస్ మ్యాన్' కథ ఏమిటనేది అందరికీ ఉత్కంఠ కలిగించే అంశంగా మారింది. 
  • వివరాల్లోకి వెళితే పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నిర్మించబోయే చిత్రం "ది బిజినెస్ మ్యాన్". 
  • ఈ చిత్రానికి క్యాప్షన్ గా "గన్స్ డోంట్ నీడ్ ఎగ్రిమెంట్స్" ( తుపాకులకు ఒప్పందాలతో పని లేదు ) అని నిర్నయించారు. 
  • గతంలో పూరీ జగన్నాథ్, మహేష్ బాబుల కాంబినేషన్ లో వచ్చిన "పోకిరి" చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బ్రద్దలు కొట్టింది. 
  • అందుకనే మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడతాయి. 
  • ఈ చిత్రం కథ మీద అందరికీ అందుకే ఆసక్తి ఏర్పడేది. ఇక ఈ ది బిజినెస్ మ్యాన్ చిత్రం కథ విషయానికొస్తే మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్ర కథ జరుగుతుందని సమాచారం. 
  • మామూలుగా మాఫియా బ్యాచ్ అంటే గతంలో రామ్ గోపాల వర్మ తీసిన కంపెనీ, సత్య చిత్రాలు గుర్తుకు వస్తాయి. 
  • అయినా ఈ మాఫియా అంటే ముంబాయి లేదా ఉత్తర భారతదేశానికి బాగా పరిచయముంటుంది కానీ, మన తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యవహారం.
  •  దావూద్ ఇబ్రహీం, ఛోటా రాజన్, షకీల్ అహ్మద్, అబూ సలేం వంటి అంతర్జాతీయ మాఫియా బ్యాచ్ గురించి మనవాళ్ళకు పెద్దగా అవగాహన ఉండదు. 
  • కాని పురీ జగన్నాథ్ ఆ రేంజ్‍ మనుషుల కథతోనే ఈ "ది బిజినెస్ మ్యాన్" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారని సమాచారం.
  • చురుకుగా సాగుతున్న మహేష్ బిజినెస్ మ్యాన్..!

     
  • పోకిరి బ్లాక్ బస్టర్ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు తో పూరీ జగన్నాథ్ చిత్రం ‘ది బిజినెస్ మాన్’ చురుగ్గా షూటింగ్ జరుపుకుంటుంది. 
  • ఈ చిత్రాన్ని ఏకకాలంలో సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేసి జనవరి 12 వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు యుద్దప్రాతిపదికన సాగుతున్నాయి. 
  • ఈ చిత్రానికి సంబంధించిన థీమ్ సాంగ్ చిత్రీకరణ ఈ నెల 4 ,6 తేదీల్లో జరిగింది. ఇందుకోసం ముంబై లో ఓ భారీ సెట్ ఏర్పాటుచేసారు.
  • ఈ సాంగ్ కు భాస్కరభట్ల సాహిత్యం సమకూర్చగా, రాహుల్ నంబియార్, రంజిత్ గొంతు కలిపారు. 
  • రాహుల్ నంబియార్ ‘దూకుడు’ సినిమాలో పాడిన ‘గురువారం’ పాటకు అనేక ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. 
  • ‘ది బిజినెస్ మాన్’ చిత్రానికి సంగీతం తమన్ సమకూరుస్తున్నారు. తమన్, భాస్కర భట్ల ప్రస్తుతం ముంబై లో పాటలు కంపోజ్, రికార్డింగ్ పనిలో ఉన్నారు.
  • ప్రస్తుతం చిత్ర టాకీ పార్ట్ చిత్రీకరణ జరుగుతోంది. 
  • మరో పాటను ఈ నెలలో షూట్ చేస్తారు. కాజల్ ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా నటిస్తుంది. 
  • ఆర్ఆర్ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. 
  • ‘పోకిరి’తో సత్తా చాటిన పూరి జగన్నాథ్-మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ఈ తాజా ప్రాజెక్టు పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. 
  • స్పెయిన్ లో మహేష్ బాబు బిజినెస్...

     
  • మహేష్ బాబు హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘ది బిజినెస్ మ్యాన్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. 
  • ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గోవాలో జరుగుతోంది. తాజాగా అందిన సమాచారం ప్రకారం గోవాలో షెడ్యూల్ పూర్తి కాగానే నవంబర్ లో సినిమా యూనిట్ స్పెయిన్ కు ప్రయాణం కానుంది. 
  • ఇక్కడి అందమైన లొకేషన్లలో పాటల చిత్రీకరణ చేయనున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మహేష్ బాబు సరసన తొలిసారి జతకడుతుండగా...
  • ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
  •  విదేశాల్లో షూటింగ్ పూర్తయ్యాక జనవరి 12న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
  • మహేష్‌బాబు, కాజల్, ప్రకాష్ రాజ్, షాయాజి షిండే, నాజర్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, బ్రహ్మాజీ, బండ్ల గణేష్, భరత్ రెడ్డి, రాజా మురాద్, జహంగీర్ ఖాన్, మహేష్ బాల్రాజ్, ఆయేషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, ఫైట్స్: విజయ్, ఆర్ట్: చిన్నా, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, డాన్స్: దినేష్, కో డైరెక్టర్: విజయ ప్రసాద్ .

No comments:

Post a Comment